కామెడీ తప్ప ఏమీ లేదు..టాలెంట్ బయటకు రావట్లేదు
on Jul 19, 2025
ఢీ షో గురించి కొరియోగ్రాఫర్ రేవంత్ కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఢీ షో పార్టిసిపెంట్స్ చేసే సాంగ్ కి, డాన్స్ కి అసలు సంబంధం ఉండదు.. జిమ్నాస్టిక్స్ చేస్తూ ఉంటారు, సర్కస్ ఫీట్స్ చేస్తూ ఉంటారు అని ట్రోల్ చేస్తూ ఉంటారు అని అడిగిన ప్రశ్నకు కొరియోగ్రాఫర్ రేవంత్ తన మనసులోని విషయాన్ని బయటపెట్టారు. " ఢీ షోని ఒకప్పుడు అందరూ మెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు ఎందుకు మెచ్చుకోవట్లేదు అనే విషయాన్ని ఒక సారి పరిశీలించుకోవాలి. డాన్స్ షో అనేది డాన్సర్ బేస్ గా జరగాలి కానీ అదెప్పుడు జరుగుతుందో తెలీదు. ఫిలిం ఇండస్ట్రీలో అదెప్పుడు జరుగుతుందో చూద్దాం.
డాన్స్ షో డాన్సర్ మీద జరగాలి కానీ ఎవరో కమెడియన్స్ వచ్చేసి జడ్జ్ చేయడం బాలేదు. జడ్జెస్ ని కూడా నువ్వు డాన్సర్స్ ని పెట్టు. డాన్స్ గురించి బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్లను పెడితే ఓకే అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రియమణి గారిని కానీ, పూర్ణ మేడమ్ ని కానీ ఒకప్పుడు ఉన్న రేఖ ప్రకాష్ మేడం కానీ వాళ్లంతా గుడ్. ఐతే బేసిక్ గా ఐడియాలజీ మారాలి. 2025 లో మనం ఉన్నాం. ఇంకా ఇప్పటికీ రియాలిటీ షోస్ చేస్తున్నాం..అదే కామెడీ చేస్తాం అంటే కుదరదు..దాని వలన షో మొత్తం కూడా నవ్వులపాలైపోతుంది..టాలెంట్ బయటకు రాదు. ఆడియన్స్ మంచి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చూసి ఎంటర్టైన్ అవ్వాలి. మంచి మంచి డాన్సర్స్ టాలెంట్ బయటకు రావాలి. నేను విష్ చేస్తున్నా ఇప్పటికైనా కొంచెం అన్నా మారండి. డాన్స్ షోని డాన్స్ షోగా కండక్ట్ చేస్తే టాలెంట్ బయటకు వస్తుంది. షో మేకర్స్ డాన్స్ షోలో వేరే కామెడీ అదీ మొత్తం చూపించేసి డాన్స్ పెర్ఫార్మెన్స్ లో వావ్ మూమెంట్స్ లేవు అంటే ఎలా...ఎవరైనా యూట్యూబ్ లో కనిపించే డాన్స్ షో ఎపిసోడ్స్ చూస్తారా ఆడియన్స్ చూడరు డాన్స్ స్కిప్ చేసేసి కామెడీ బిట్స్ ని చూస్తున్నారు. ఆడియన్స్ కి కూడా డాన్స్ షోలో కామెడీ చూడడం అలవాటు చేసేసారు. ఓవరాల్ గా ఛానెల్స్ కూడా మారాలి. ఆర్టిస్టులను ఆర్టిస్టుల్లా, డాన్సర్స్ ని డాన్సర్స్ లా యూజ్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ టాలెంట్ బయటకు వస్తుంది. వాళ్లకు అవకాశాలు వస్తాయి. వాళ్లకు మంచి లైఫ్ క్రియేట్ అవుతుంది. అప్పుడు పెద్ద పెద్ద ప్లాట్ఫార్మ్స్ మీద పెర్ఫార్మ్ చేసే అవకాశం వస్తుంది. బాలీవుడ్ ని చూస్తే మంచి మంచి డాన్స్ రియాలిటీ షోస్ ఉన్నాయి. అక్కడి డాన్సర్స్ అంతా మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు." అని చెప్పుకొచ్చాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
